రీరిలీజ్ కాబోతున్న రజినీకాంత్ సూపర్ హిట్ మూవీ.. 'శివాజీ' విడుదల ఎప్పుడంటే..

Praja Tejam
0


 సౌత్ ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ యమ జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలలుగా స్టార్ హీరోస్ సూపర్ హిట్ మూవీస్, డిజాస్టర్స్.. ఇలా ప్రతి ఒక్క ను మరోసారి అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు మేకర్స్.

అయితే ఇప్పుడు 4K వెర్షన్స్ లో రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే తెలుగు టాప్ హీరోస్ చిత్రాలను రీరిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచిన చిత్రాలు ఇప్పుడు భారీ వసూళ్లు రాబట్టాయి. దీంతో కోలీవుడ్ ఇండస్ట్రీలోనూ ఈ ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. విజయ్ దళపతి, అజిత్ వంటి స్టార్ హీరోల లను రీరిలీజ్ చేశారు. ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ ఐకానిక్ హిట్ మూవీ శివాజీ.. ది బాస్ చిత్రాన్ని రీరిలీజ్ చేయనున్నారు. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ 2007లో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.

ఇందులో రజినీతోపాటు శ్రియా శరణ్, సుమన్ కీలకపాత్రలు పోషించారు. కోలీవుడ్ చరిత్రలో రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన తొలి తమిళ శివాజీ నిలిచింది. ఏఆర్ రెహమాన్ కు శివాజీ 100వ కావడం విశేషం. అయితే అప్పట్లో మంచి విజయాన్ని అందుకున్న ఈ సుమారు 17 ఏళ్ల తర్వాత మరోసారి రీరిలీజ్ కానుంది. సెప్టెంబర్ 20న 4k వెర్షన్ లో శివాజీ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. అయితే ఎంపిక చేసిన స్క్రీన్స్ లో టికెట్ ధర రూ.99 మాత్రమే ఉండనుంది.

2012లో రజినీ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని 3D వెర్షన్ లో రిలీజ్ చేశారు. అయితే ఈ మూవీ నిడివి 30 నిమిషాలు తగ్గించారు. 3D కొత్త డాల్బీ అట్మాస్ ఫ్లాట్ ఫారమ్ తో ప్రారంభించబడిన మొదటి భారతీయ గా ఇది రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ ను సెప్టెంబర్ 20న రీరిలీజ్ చేయనున్నారు. దీంతో ఇప్పుడే తలైవా ఫ్యాన్స్ సంబరాలు స్టార్ట్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">