విన్న ప్రతిదాన్నీ నమ్మొద్దు

Praja Tejam
0

 


జానీ మాస్టర్‌ అరెస్టు నేపథ్యంలో నాగబాబు

నాగబాబు పరోక్షంగా జానీ మాస్టర్‌కు

 మద్దతు పలికారంటున్న నెటిజన్లు

 హైదరాబాద్‌: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ అరెస్టు తర్వాత నటుడు, జనసేన పార్టీ నేత నాగబాబు 'ఎక్స్‌'లో చేసిన రెండు పోస్టులు సోషల్‌ మీడియాలో చర్చకు దారితీశాయి.

'న్యాయస్థానంలో నేరం రుజువయ్యే వరకు ఏ వ్యక్తినీ నేరానికి పాల్పడినట్లుగా పరిగణించలేరు'అన్న బ్రిటిష్‌ లాయర్‌ సర్‌ విలియం గారో కొటేషన్‌ను ఆయన రాసుకొచ్చారు. అలాగే 'మీరు విన్న ప్రతిదాన్నీ నమ్మొద్దు.ప్రతి కథకు మూడు పార్శా్వలు ఉంటాయి. మీ వైపు, నా వైపు మరియు నిజం'అని అమెరికా జర్నలిస్ట్‌

రాబర్ట్‌ ఎవాన్స్‌ రాసిన కొటేషన్‌ను కూడా పోస్టు చేశారు. జానీ మాస్టర్‌ గురించి ప్రత్యక్షంగా ఆయన ఎక్కడా ప్రస్తావించకపోయినా పరోక్షంగా మద్దతు పలికారనే అభిప్రాయాన్ని నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. జనసేన పారీ్టలో జానీ మాస్టర్‌ కీలకంగా వ్యవహరించడం వల్లే నాగబాబు ఇలా స్పందించారని అంటున్నారు.

జానీ మాస్టర్‌.. తప్పు చేస్తే అంగీకరించండి: మంచు మనోజ్‌
జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు, అరెస్టు నేపథ్యంలో నటుడు మంచు మనోజ్‌ స్పందించారు. 'ఎక్స్‌'లో ఓ పోస్టు పెట్టారు. 'జానీ మాస్టర్‌.. కెరీర్‌ పరంగా ఈ స్థాయికి వచ్చేందుకు మీరు ఎంతగా కష్టపడ్డారో అందరికీ తెలుసు. అలాంటిది ఈరోజు మీపై ఇలాంటి తీవ్ర ఆరోపణలు రావడం చూస్తుంటే నా హృదయం ముక్కలవుతోంది. ఇప్పుడు కాకపోయినా నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. ఎవరిది తప్పు, ఎవరిది కరెక్ట్‌ అన్నది చట్టం నిర్ణయిస్తుంది. ఒక మహిళ తన స్వరాన్ని వినిపించినప్పుడు పారిపోవడం అనేది సమాజానికి, రానున్న తరాలకు ఒక ప్రమాదకరమైన సందేశాన్ని ఇస్తుంది. ఈ కేసు విషయంలో త్వరితగతిన స్పందించి చర్యలు తీసుకున్న హైదరాబాద్‌ సిటీ పోలీసులకు నా అభినందనలు.

ఈ సమాజంలో చట్టానికి ఎవరూ అతీతులు కాదని ఇది తెలియజేస్తుంది. జానీ మాస్టర్‌.. మీరు ఏ తప్పూ చేయకపోతే పోరాటం చేయండి. తప్పు చేసి ఉంటే దానిని అంగీకరించండి..'అని మనోజ్‌ పేర్కొన్నారు. 'ఇచి్చన మాట ప్రకారం ఉమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ని వెంటనే ఏర్పాటు చేయాలని మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా)ను కోరుతున్నా. దానికంటూ ప్రత్యేకంగా సోషల్‌ మీడియా ఖాతాలు ఏర్పాటు చేయండి. పరిశ్రమలోని మహిళలకు గొంతుగా నిలపండి. మీరు ఒంటరిగా లేరని, మీ ఆవేదన, బాధలను వింటామనే విషయాన్ని ప్రతి మహిళకు తెలియజేయండి. కుమార్తె, సోదరి, తల్లి.. ఇలా ప్రతి మహిళ కోసం ఈ పోరాటం. వారికి అన్యాయం జరగకుండా చూద్దాం..'అంటూ మనోజ్‌ పోస్టు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">