మనమంతా కలిసికట్టుగా ముందడుగు వేద్దాం రండి.
స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పిలుపు
కొత్త చెరువు:17 ప్రజాతేజమ్
పల్లెలను స్వచ్ఛత వైపు నడిపించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పిలుపునిచ్చారు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛత కి సేవ పేరిట ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మంగళవారం కొత్తచెరువులో కలెక్టర్ చేతన్తోపాటు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామపంచాయతీలో స్వచ్ఛత కి సేవా కార్యక్రమాలు అక్టోబర్ 2 వరకు నిర్వహించేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఎంతో అభినందించదగ్గ విషయం అన్నారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ , ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ ఇలాంటి కార్యక్రమం ఎంతో అవసరమన్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్, పాలిథిన్ వస్తువులను పూర్తిగా అరికట్టినప్పుడే గ్రామాలు స్వచ్ఛత వైపు అడుగులు పడతాయని అన్నారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరూ సామూహిక శుభ్రత పాటించాలనీ పిలుపునిచ్చారు. గ్రామాల్లో పేరుకుపోయిన చెత్తకుప్పలు ,వ్యర్థాలు తొలగించి దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని తెలిపారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఆయా గ్రామపంచాయతీలోని ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో విరివిడిగా మొక్కలు నాటడం సంరక్షించడం చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు గ్రామాల లో పారిశుద్ధ్యని మెరుగుపరచాలని సూచించారు. పారిశుద్ధ కార్మికుల కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.అనంతరం కొత్త చెరువు లో జరిగిన వివాహానికి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.