పారిస్ ఒలంపిక్స్‌లో తృటిలో పతకం చేజారిన భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్.. నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. 50 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉన్నందున..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో వినోశ్ ఫొగాట్.. ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్ (IOA), దాని అధ్యక్షురాలు పీటీ ఉషపై తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. పారిస్‌లో వారి నుంచి తనకు ఏమి మద్దతు లభించిందో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. తనకు మద్దతు తెలిపే విషయంలో ఐవోఏ తీవ్ర జాప్యం కారణం చేసినందునే కాస్‌లో తీర్పు తనకు అనుకూలంగా రాలేదన్నారు. పీటీ ఉష ఫొటోల కోసమే తనను పరామర్శించేందుకు వచ్చారని ఆరోపించారు. తన ఆరోగ్యం గురించి ఆమె ఏమీ ఆడగలేదని ఆరోపించారు. రాజకీయాల్లో తెరవెనుక చాలా జరిగినట్లే.. పారిస్‌లో కూడా పెద్ద రాజకీయం చేశారంటూ ఆమె అసహనం వ్యక్తంచేశారు. అందుకే తన గుండె బద్దలయ్యిందంటూ ఆవేదన వ్యక్తంచేశారు. చాలా మంది రెజ్లింగ్‌కు వీడ్కోలు చెప్పొద్దని సలహా ఇచ్చారని.. అయితే అన్ని చోట్లా రాజకీయం ఉందని, తాను ఎందుకు రెజ్లింగ్ కొనసాగించాలని ప్రశ్నించారు.