నేడు ఏపీ క్యాబినెట్ సమావేశం.. చర్చించే అంశాలివే..

Praja Tejam
0


 మరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ ఇవాళ(బుధవారం) మరోసారి భేటీ కానుంది. ఉదయం 11గంటలకు జరిగే సమావేశంలో మంత్రులు పాల్గొని కీలక అంశాలపై చర్చించనున్నారు.

అక్టోబర్ 1నుంచి రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ అమలు చేయాలని నిర్ణయించిన చంద్రబాబు సర్కార్.. నూతన విధానంపై చర్చించి ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. దీనిపై ఇప్పటికే పలు రాష్ట్రాల మద్యం విధానంపై అధికారులు ఇచ్చిన నివేదికను మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేసింది. దీన్ని ఇవాళ క్యాబినెట్ ముందు పెట్టనున్నారు. దీనిపై చర్చ అనంతరం కీలక నిర్ణయం తీసుకోనున్నారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలు విజయవాడ నగరాన్ని ముంచెత్తాయి. అజిత్ సింగ్ నగర్, జక్కంపూడి, వాంబే కాలనీ, కండ్రిక, వైఎస్ఆర్ కాలనీ, నందమూరి నగర్, రాజరాజేశ్వరి పేట, భవానీ నగర్, ఊర్మిళానగర్‌తోపాటు రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడి ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ఈ సందర్భంగా క్యాబినెట్ సమావేశంలో వరదనష్టంపై మంత్రులు చర్చించనున్నారు. వరద సహాయం, పంటనష్ట పరిహారం విషయంలో కేంద్రం నుంచి అందే సాయంపైనా కేబినెట్‌లో చర్చించనున్నారు.

అలాగే రూ.25వేల ఆర్థికసాయం చేస్తామంటూ ముఖ్యమంత్రి ప్రకటించిన నేపథ్యంలో దీనిపై కులంకశంగా చర్చించనున్నారు. మరోవైపు వరదల సమయంలో అధికారుల పనితీరుపై చర్చించి వారిని మంత్రి మండలి అభినందించనుంది. బుడమేరు గండ్లు పూడ్చడంలో జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేశ్ చేసిన కృషి క్యాబినెట్‌లో ప్రస్తావించే అవకాశం ఉంది.

ఈనెల 20వ తారీకుతో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100రోజులు కానుండడంతో ఇప్పటివరకూ చేసిన పనులపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. వివిధ శాఖల మంత్రులు తమ వందరోజుల ప్రణాళికల ఫలితాలపైనా సమావేశంలో చర్చిస్తారు. మంత్రిత్వ శాఖలు ఇచ్చే నివేదికలపైనా చర్చ జరగనుంది. వంద రోజుల పాలనలో మంత్రుల గ్రాఫ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు అందించనున్నారు. జనసేన మంత్రుల గ్రాఫ్‌ను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు సీఎం ఇవ్వనున్నారు. వరద సహయక చర్యలలో ముఖ్యమంత్రి, మంత్రులు పనిచేసిన తీరును క్యాబినెట్ అభినందించనుంది.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">