ఐపీఎల్ అత్యుత్తమ సారథుల్లో రోహిత్ శర్మ ఒకడు. ముంబై ఇండియన్స్ జట్టుకు ఏకంగా ఐదు సార్లు టైటిల్స్‌ను అందించాడు. అయితే..
ముంబైతో అతడి ప్రయాణం ముగిసినట్లేనని అన్నాడు. రోహిత్ మెగా వేలంలోకి వచ్చే అవకాశం ఉందన్నాడు. అలాకానీ పక్షంలో ట్రేడింగ్ ద్వారా వేరే ప్రాంఛైజీకి అతడు బదిలీ కావొచ్చునని చెప్పుకొచ్చాడు. తన అభిప్రాయం ప్రకారం మెగా వేలం రానున్నడంతో ముంబై అతడిని వదిలి వేస్తుందన్నాడు. ఇక ఆ జట్టుతో కొనసాగడం రోహిత్‌కు ఇష్టం లేదన్నాడు.జట్టుతో పాటు మూడేళ్లు కొనసాగే ఆటగాడిని మాత్రమే ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. అయితే.. ఇది మహేంద్ర సింగ్ ధోనికి వర్తించదు. ధోని-సీఎస్‌కే కథ వేరు. అయితే.. ముంబై పరిస్థితి వేరు. రోహిత్ స్వయంగా వెళ్లిపోవచ్చు లేదంటే ముంబై జట్టే అతడిని విడిచిపెట్టవచ్చు అని చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ తెలిపాడు.
సూర్యకుమార్ యాదవ్ ను సైతం ముంబై జట్టు వదులుకుంటుందా అన్న ప్రశ్నసమాధానం ఇస్తూ.. అతడిని ముంబై వదులుకోదని, అతడు ముంబైని విడిచి ఎక్కడికి వెళ్లడు అని అన్నాడు.ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు రోహిత్ శర్మను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించిన ముంబై గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడింగ్ ద్వారా హార్దిక్ పాండ్యాను తీసుకుని నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. దీనిపై రోహిత్ ఫ్యాన్స్ నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వచ్చాయి. ఇంకోవైపు పాండ్య నాయకత్వంలో జట్టు పేలవ ప్రదర్శన చేసింది. పాండ్యాకు సీనియర్ ఆటగాళ్లకు మధ్య మంచి సంబంధాలు లేవని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే హిట్‌మ్యాన్ జట్టును వీడనున్నాడు అని తెరపైకి వచ్చింది.
రోహిత్ నాయకత్వంలో ముంబై ఇండియన్స్ 2013, 2015, 2017, 2019, 2020 ఐపీఎల్ ఎడిషన్లలో విజేతగా నిలిచింది.