సాగునీటి సలహా మండలి సమావేశంలో ఎమ్మెల్యే అమిలినేని
అనంతపురం జిల్లాలో అత్యంత వెనుకబడిన నియోజకవర్గం కళ్యాణదుర్గం ఇక్కడి రైతులకు నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జీడిపల్లి నుంచి బీటీపీ వరకు, కుందుర్పి బ్రాంచ్ కేనాల్ కు నీళ్లు ఇచ్చే లక్ష్యంతో నాటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2019లో బీటీపీ కాలువ పనులు ప్రారంభించారు.. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ ప్రాజెక్ట్ పనులను నిర్వీర్యం చేశారని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలో తెలిపారు.. బీటీపీ కాలువ పనులు పూర్తి చేసి కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని 114 చెరువులతో పాటు కుందుర్పి బ్రాంచ్ కేనాల్ కు నీళ్లు తీసుకురావాలని దీని ద్వారా కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాలకు ఎంతో ఉపాయుక్తంగా ఉంటుందని అమిలినేని సలహా మండలి దృష్టికి తీసుకువచ్చారు.. ముఖ్యమంత్రి తప్పకుండా ఈ ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసేలా జిల్లా మంత్రులు కృషి చేయాలనీ విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారు..