జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్
అనంతపురం, సెప్టెంబర్ 13 :ప్రజాతేజమ్
* జిల్లాలో జాబ్ మేళా ను షెడ్యూల్ ప్రకారం నిర్వహించేలా చూడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ ఆదేశించారు.*
శుక్రవారం నగరంలోని కోర్టు రోడ్డు లోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయమును జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని సిబ్బంది వివరాలను, వారు చేసే పనులను, వారుచేసే కార్యక్రమాలను పరిశీలించారు. అప్రెంటిషిప్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ జరగాలని తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ అధికారి, జిల్లా ఉపాధి కల్పన అధికారి సమన్వయంతో అప్రెంటిషిప్ యాక్ట్ ద్వారా ప్రైవేట్ కంపెనీల వారితో సంప్రదించి యువతకి అవకాశం కల్పించే విధంగా జాబ్ మేళాలను ఏర్పాటుచేసి ఉద్యోగ అవకాశం కల్పించాలన్నారు.
సంకల్ప పథకం కింద వచ్చే నిధులను సరైన పద్ధతిలో వినియోగించుటకు ప్రణాళికలు తయారు చేయాలన్నారు. జాబ్ మేళాను షెడ్యూల్ ప్రకారం నిర్వహించే విధంగా చూడాలన్నారు.
పదో తరగతి తర్వాత ఇలాంటి కోర్సులు చేయాలని పి పి టి ని తయారు చేయాలని యంగ్ ప్రాసెసర్ ను ఆదేశించారు. ప్రతి స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్,ఎస్టీ, ఎస్సీ, బిసి, హాస్టల్స్ నందు అవగాహన కల్పించాలని తెలిపారు.
జిల్లాలో ఉపాధి శిక్షణ కార్యక్రమాలు, జాబ్ మేళాలు, విద్యార్థులలో కోర్సులపై అవగాహన కల్పించే విధంగా జిల్లా ఉపాధి కల్పన అధికారి, స్కిల్ డెవలప్మెంట్ అధికారి,ఎన్ ఎ సి అసిస్టెంట్ డైరెక్టర్ వారు సమన్వయం చేసుకొని జిల్లాలో విద్యార్థినీ విద్యార్థులకు, యువతకు ఉపాధి మరియు ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో ఉద్యోగ అవకాశం కల్పించే విధంగా చూడాలని, రాష్ట్రంలో అనంతపురం జిల్లా నందు ఎక్కువ అవకాశం కల్పించే విధంగా చూడాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పన అధికారి కళ్యాణి,ఎన్ ఎ సి అసిస్టెంట్ డైరెక్టర్ గోవిందరాజులు, స్కిల్ డెవలప్మెంట్ అధికారి రాజ్ కుమార్, అనంతపురం రూరల్ తహసీల్దార్ హరిబాబు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.