అయితే ఈ సినిమా అనౌన్స్ చేసిన తర్వాత అభిమానులు కాస్త టెన్షన్ పడ్డారు కానీ ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత సినిమా మీద నమ్మకాలు పెరిగాయి. ఇక ఈ సినిమాకి సంబంధించి మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ సహా కొరటాల శివ ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉన్నారు. ముందుగా ముంబైలో ప్రమోషన్స్ చేసి వచ్చిన టీం ఇప్పుడు హైదరాబాదులో కొంతమంది యంగ్ హీరోలతో ఇంటర్వ్యూస్ ప్లాన్ చేశారు.
అయితే ఈ సినిమాకి టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు పెంచిన టికెట్ రేట్లకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నైజాం అంటే తెలంగాణాలో మల్టీప్లెక్స్ లలో Rs 413/- సింగిల్ స్క్రీన్స్ లో Rs 250/. అలాగే ఏపీలో మల్టీప్లెక్స్ లలో Rs 325/- సింగిల్ స్క్రీన్స్ లో Rs 200/- లెక్కన అమ్ముకోడానికి అవకాశం ఇచ్చారు. ఈ సినిమాని కొరటాల శివ స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ తో పాటు కళ్యాణ్ రామ్ బావమరిది కొసరాజు హరికృష్ణ ఎన్టీఆర్ ఆర్ట్స్ యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ల మీద సంయుక్తంగా నిర్మించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగ వంశీ ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల హక్కులు భారీ మొత్తానికి దక్కించుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు పర్మిషన్ అడగగా ఇప్పుడు ఈ మేరకు పెంచుకునే అవకాశం కల్పించారు.