Adrushta Remedies : ఇంట్లో కర్పూరం వెలిగిస్తే కలిగే లాభాలు మాత్రమే మీరింత వరకు తెలుసుకుని ఉంటారు. కానీ కర్పూరాన్ని వెలిగించకుండా అలాగే ఉంచినా కూడా ఎన్నో లాభాలు ఉన్నాయంటున్నారు పండితులు.
హిందూ పురాణాల ప్రకారం వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. కోట్ల రూపాయలు ఖర్చు చేసి.. ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టినా.. అది వాస్తు ప్రకారం లేకపోతే చాలా కష్టాలు వస్తాయని వాస్తు శాస్త్రం నానుడి. అయితే వాస్తు ప్రకారం నిర్మించని ఇంట్లో ఉండే వారి జీవితంలో కూడా అనుకోని కష్టాలు వస్తుంటాయని.. వారు ఎంత కష్టపడినా జీవితంలో పైకి ఎదగరని అనేక రకాల ఇబ్బందులు పడాల్సి వస్తుందని పండితులు చెప్తుంటారు.
అయితే కొన్ని సందర్భాలలో వాస్తు శాస్త్రాన్ని విశ్వసించని వారు తమకు నచ్చినట్టుగా.. అధునాతన డిజైన్లతో ఇండ్లు కట్టుకుంటారు. తర్వాత ఆ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ రావడంతో అష్టకష్టాలు పడుతుంటారు. కోట్లు పెట్టి కట్టుకున్న కలల సౌధం తమ భవిష్యత్తుకు అడ్డంకిగా మారిందని.. తెలిసినా.. జీవితంలో ఏ పని చేసినా కలసిరాక ఇబ్బందులు పడుతున్నామని తెలిసినా వాస్తు దోషం ఉందని పండితులు చెప్పినప్పుడు. ఇక ఆ ఇంటిని కూలగొట్టలేరు. అలాగని ఆ ఇంటిని విడిచిపెట్టి వెళ్లలేరు. అటువంటి వాళ్ల కోసమే సనాతన ధర్మంలో చాలా రెమిడీస్ ఉన్నాయి. అందులో ముఖ్యమైనది.. చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నదే కర్పూరంతో చేసే రెమెడీ.
0Comments
Copyright (c) 2024 praja tejam | kings man All Right Reseved
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">