ఫ్లాప్ అయ్యే ప్రసక్తే లేదంటున్న బాలయ్య అభిమానులు
మొదటి సినిమాతో మోక్షజ్ఞకు భారీస్థాయిలో నిర్మాతలు రెమ్యునరేషన్ ఇస్తున్నారు. తొలిసినిమాకే అతను రూ.20 కోట్లు అందుకోబోతున్నట్లు సమాచారం. సినిమా ఏదీ విడుదల కాకుండానే ఒక స్టార్ హీరో తో సమానంగా రెమ్యునరేషన్ తీసుకోవడంపై ఫిలింనగర్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సినిమా విడుదలైన తర్వాత బాలయ్య అభిమానులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు కలిసి సంయుక్తంగా హిట్ చేస్తారని మాట్లాడుకుంటున్నారు. అంతేకాకుండా ప్రశాంత్ వర్మ చెప్పిన కథ కూడా మినిమం గ్యారంటీ కావడంతో అయితే బ్లాక్ బస్టర్ అవుతుంది లేదంటే కచ్చితంగా హిట్ అవుతందికానీ ఫ్లాప్ అయ్యే ప్రసక్తే లేదని చెబుతున్నారు.
రెండు సినిమాలను సిద్ధం చేస్తున్న బాలయ్య
ఈ సినిమా తర్వాత వరుసగా మరో రెండు సినిమాలను బాలయ్య సిద్ధం చేస్తున్నారు. రెండో సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించబోతున్నారు. హీరోయిజాన్ని బాగా చూపించడంతోపాటు మంచి మాస్ ఫాలోయింగ్ తీసుకురావడంతో బోయపాటి దిట్ట. అందుకే రెండో సినిమాను బోయపాటితో ఖరారు చేసినట్లు సమాచారం. అలాగే మూడో సినిమాను కామెడీ, ఎంటర్ టైనర్ తో అలరించే అనిల్ రావిపూడితో తీయాలనేది బాలకృష్ణ ఆలోచన. ఇలా అయితే మోక్షజ్ఞలో ఉన్న కామెడీ యాంగిల్ అనేది కూడా ప్రేక్షకులకు పరిచయం అవుతుందని, అన్నిరకాలుగా నవరసాలను పండించే హీరోగా తీర్చిదిద్దాలనేది బాలయ్య యోచనగా ఉంది.