ఏపీలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. రాయలసీమలో ఏర్పాటు

Praja Tejam
0


 పీకి రైల్వేశాఖ తీపికబురు చెప్పింది.. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సానుకూలంగా స్పందించింది. చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిశారు.

చిత్తూరు పార్లమెంట్‌ పరిధిలోని తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్న పాకాల రైల్వేస్టేషన్‌ (జంక్షన్‌)ను అభివృద్ధి చేయడంతో పాటు, రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఇక్కడ ఏర్పాటు చేయాలని కోరారు. అయితే రైల్వేశాఖ మంత్రి సానుకూలంగా స్పందించారని.. హామీ ఇచ్చారని ఎంపీ ప్రసాదరావు తెలిపారు. వచ్చే ఏడాది మార్చి నుంచి పాకాల రైల్వేస్టేషన్‌ను ఆధునికీకరించడంతో పాటుగా పరిసర ప్రాంతాల్లో ఎనిమిది లైన్ల రైల్వేలైన్లతో పాటుగా కోచ్‌ ఫ్యాక్టరీని నిర్మించేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు చెప్పారు.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">