రెయిన్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో వర్షాలు.. మూడు రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో..

Praja Tejam
0


 తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించిన వర్షాలు.. ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టాయి.. భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. అతలాకుతలమయ్యాయి.. ఈ క్రమంలో అమరావతి వాతావరణ కేంద్రం కీలక ప్రకటచేసింది..

ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని.. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలతో బుధవారం ప్రకటన విడుదల చేసింది.

    ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్-యానాం :- బుధవారం, గురువారం, శుక్రవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :- బుధవారం, గురువారం, శుక్రవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షము ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.రాయలసీమ:- బుధవారం, గురువారం, శుక్రవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది.

    ఇవాళ ఈ ప్రాంతాల్లో వర్షాలు.. బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">