బాధితులను పరామర్శించిన అనంత వెంకటరామిరెడ్డి.
అనంతపురం, సెప్టెంబర్ 14 :ప్రజాతేజమ్
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కుందుర్పి మండలం తూమకుంట గ్రామానికి చెందిన జగదీష్ ఆయన భార్య రోజా, వారి బంధువుల పై శుక్రవారం రాత్రి టిడిపి శ్రేణులు దాడి చేశారు. దాడిలో జగదీష్, రోజా లు తీవ్రంగా గాయపడడంతో అనంతపురం సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న వైయస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి భాదితులను పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితుల ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అధైర్య పడకండి, అండగా ఉంటామని బాధిత కుటుంబ సభ్యులకు భరోసానిచ్చారు. కార్యక్రమంలో కుందిర్పి ఎంపిపి కమల నాగరాజు, మార్కెట్ డైరెక్టర్ జి లింగప్ప, ఎనమల దొడ్డి సర్పంచ్ విజయ్, తెనగల్లు సర్పంచ్ వరలక్ష్మి వెంకటేశులు, మాజీ జెడ్పిటిసి రాజగోపాల్, మాజీ సర్పంచ్ తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు.