తాసిల్దార్ మహబూబ్ బాషా
ఉరవకొండ:సెప్టెంబర్12 (ప్రజాతేజం)
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మక చేపట్టిన దుకాణాల ద్వారా చేపట్టిన నిత్యవసర సరుకులు పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తే వారిపై క్రిమినల్ చర్యలు తప్పవని ఉరవకొండ తాసిల్దార్ మహబూబ్ బాషా పేర్కొన్నారు.గురువారం పట్టణంలోని చౌక ధాన్యపు దుకాణాలను అకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు.ఈ తనిఖీలో భాగంగా చౌక ధాన్యపు షాపు నంబరు 19 డీలర్ పి.అరుణ షాపు తనిఖీ చేయడమైనది.ఈ తనిఖీలో 27.59 క్వింటాల బియ్యం షాపు నందు తక్కువగా ఉండటంతో నిత్యవసరాల పంపిణి చట్టంలోని సెక్షన్ 6ఎ ప్రకారం కేసు నమోదు చేయడంతో పాటు పై నిల్వలను రికవరీ చేయుట కొరకు పోలిస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
నిత్యావసరాల సరుకుల పంపిణీ విషయములో ప్రతి డీలర్ మరియు ఎండియు పరేటరు వారికి కేటాయించిన కార్డుదారులకు భాద్యతగా సరుకులను పంపినీ చేయాలని ఆదేశించారు.ఈ విషయములో డీలర్లు ఎవరైనను ఉపేక్షిస్తే తప్పని సరిగా క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.