బెల్లంకొండ కొత్త సినిమాకు సూపర్ టైటిల్ ఫిక్స్.. టైటిల్ ఇదే!

Praja Tejam
0

 


టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ తో సంబంధం లేకుండా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న నటులలో బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) ఒకరు కాగా రాక్షసుడు మూవీ తర్వాత ఈ హీరోకు ఆ రేంజ్ సక్సెస్ ను సొంతం చేసుకోలేదు.

తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన గరుడన్ రీమేక్ లో బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తుండగా ఈ సినిమాకు మొదట గరుడ అనే టైటిల్ ను పరిశీలించారట. అయితే ఆ టైటిల్ ఇప్పటికే రిజిష్టర్ కావడంతో ఈ సినిమాకు వీర ధీర శూర అనే టైటిల్ ను ఫైనల్ చేశారట.

మంచు మనోజ్ (Manchu Manoj) , నారా రోహిత్ (Nara Rohit) కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మనోజ్ ఈ సినిమాలో విలన్ రోల్ లో నటిస్తున్నారని ప్రచారం జరగగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాతో పాటు పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. ఈ హీరో సినిమాలు ఒకింత భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతున్నాయి.

బెల్లంకొండ శ్రీనివాస్ భవిష్యత్తు ప్రాజెక్టుల రిలీజ్ డేట్లకు సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది. బెల్లంకొండ శ్రీనివాస్ రెమ్యునరేషన్ పరిమితంగానే ఉండగా పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ సాధించాలని ఈ హీరో భావిస్తున్నారు. బెల్లంకొండ భవిష్యత్తు సినిమాలలో ఏ సినిమాతో పాన్ ఇండియా హిట్ దక్కుతుందో చూడాల్సి ఉంది.

బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేసి లక్ పరీక్షించుకోగా ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. బెల్లంకొండ శ్రీనివాస్ తన సినిమాలతో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. పాన్ ఇండియా డైరెక్టర్ల డైరెక్షన్ లో బెల్లంకొండ శ్రీనివాస్ నటించాలని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">