కోహ్లీ.. బాబర్‌ అజామ్‌.. ఒకే జట్టు తరఫున ఆడతారా?

Praja Tejam
0

ఇటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ, జస్‌ప్రీత్‌ బుమ్రా.. పాక్ స్టార్‌ ఆటగాళ్లు బాబర్‌ అజామ్‌ (Babar Azam), షహీన్ అఫ్రిది తదితర ఆటగాళ్లు మరికొన్ని రోజుల్లో ఒకే జట్టు తరఫున ఆడే అవకాశముంది!

గతంలో నిర్వహించిన ఆఫ్రో-ఆసియా కప్‌ను పునరుద్ధరించాలని ఆఫ్రికా క్రికెట్ అసోసియేషన్‌ భావిస్తుండమే ఇందుక్కారణం. 2005, 2007లో ఈ టోర్నమెంట్‌ను నిర్వహించారు. వివిధ కారణాల వల్ల దీనిని నిలిపివేశారు. ఇందులో ఆసియా దేశాల క్రికెటర్లు ఒక జట్టుగా, ఆఫ్రికా దేశాల క్రికెటర్లు మరో జట్టుగా ఏర్పడి పోటీపడేవారు. వీరేంద్ర సెహ్వాగ్, ఇర్ఫాన్‌ పఠాన్‌, ఇంజామామ్‌ ఉల్ హక్‌, జహీర్ ఖాన్‌, షోయబ్ అక్తర్‌, అనిల్ కుంబ్లే, షహిద్‌ అఫ్రిది ఆసియా జట్టుకు ఆడారు. ఆఫ్రికా జట్టు తరఫున షాన్ పొలాక్, జాక్వెస్ కలిస్, టాటెండా తైబు వంటి ఆటగాళ్లు ఆడారు.

ఈ టోర్నీని పున: ప్రారంభించాలని 2022లో ఆసియా క్రికెట్‌ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్న బీసీసీఐ కార్యదర్శి జై షాతో అప్పటి ఆఫ్రికా క్రికెట్ అసోసియేషన్ (ACC) అధ్యక్షుడు సుమోద్ దామోదర్, ఏసీసీ డెవలప్‌మెంట్ హెడ్ మహింద వల్లిపురం సంప్రదింపులు జరిపారు. మహింద ఐసీసీ బోర్డు సభ్యునిగా తిరిగి ఎన్నికవడం, జై షా ఐసీసీ ఛైర్మన్‌ కావడంతో ఆఫ్రో-ఆసియా కప్‌ను నిర్వహణ విషయంలో కదలిక వచ్చే అవకాశముందని ఏసీసీ మాజీ అధ్యక్షుడు దామోదర్ తెలిపారు.


Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">