వాలంటీర్లు వరద బాధితుల కోసం సేకరించిన విరాళాలు జాయింట్ కలెక్టర్ కు అందచేత

Praja Tejam
0

 


అనంతపురం, సెప్టెంబర్ 13:ప్రజాతేజమ్

*SVGM ప్రభుత్వ డిగ్రీ కళాశాల NSS వాలంటీర్ల  సేకరించిన విరాళం 65,123/ రూపాయల DD ని AP CM-RF పేరిట తీసి దాన్ని కళ్యాణదుర్గం ఆర్డీవో డాక్టర్ రాణి సుష్మిత గారి ద్వారా జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ కు అందజేశారు. SVGM ప్రభుత్వ డిగ్రీ కళాశాల NSS వాలంటీర్లు ఆంధ్రప్రదేశ్లోని వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఏడు రోజులు పాటు సేకరించిన విరాళాలు శుక్రవారం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి.జయరామ రెడ్డి ఆధ్వర్యంలో లెక్కించడం జరిగినది. ఐదు బృందాలుగా ఏర్పడి ఏడు రోజులు పాటు రోజుకు ఒక గంట చొప్పున NSS PO డాక్టర్ K శ్రీధర్ ఆధ్వర్యంలో సాయి, నవీన్, శ్రీలత, పురుషోత్తం, సోనియా బృందాలు 

 మొదటి రోజున

 ప్రభుత్వ కార్యాలయాలు

 రెండవ రోజున పోలీసు శాఖ, జైలు, కోర్టు పరిసరాలు

 మూడవరోజు మార్కెట్ యార్డ్ పరిసరాలు, ఉచిత డిఎస్సి శిబిరం

 నాలుగవ రోజు ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలు 

 ఐదవ రోజు ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులు 

 ఆరవ రోజు RTC, ప్రైవేట్ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో

 ఏడవ రోజు పట్టణంలోని షాపులలో విరాళాలు సేకరించారు.

   ఈ విరాళాలు కళ్యాణదుర్గం RDO డాక్టర్ రాణి సుష్మితతో ప్రాంభించి, ఆయా ప్రాంతాల్లో తిరిగారు. సాధారణ పౌరులు సైతం వివరాల్లో భాగస్వాములు అయ్యారు. వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలను NSS అధికారి డాక్టర్ K శ్రీధర్ తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ NSS వాలంటీర్లను అభినందించారు. ఈ విరాళాలను ముఖ్యమంత్రి సహాయ నిధికి DD తీసి జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ గారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో NSS PO లు Dr. K శ్రీధర్, Dr. K.రవిశంకర్, NSS వాలంటీర్లు సాయిరాం, మల్లి,  కార్తీక్, గోవర్ధన్ పాల్గొన్నారు.


Tags

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">