కొడిమి జర్నలిస్టు కాలనీలో దురాక్రమణలు అడ్డుకోవాలి

Praja Tejam
0

 


అనంతపురము జిల్లా అనంతపురము రూరల్‌ మండలంలోని కొడిమి జర్నలిస్ట్స్‌ కాలనీలో దురాక్రమణలు జరుగుతున్నాయని, వాటిని అడ్డుకొని, అర్హులైన సీనియర్‌ జర్నలిస్టులకు పట్టాలు కేటాయించాలని ఎ.పి.యుడబ్ల్యు.జె. అనంతపురము జిల్లా శాఖ డిమాండ్‌ చేసింది. అనంతపురము రూరల్‌ మండలం కొడిమి జర్నలిస్టుల కాలనీలో శుక్రవారం ఉదయం 11 గంటలకు ఏర్పాటు చేసిన సమావేశంలో యూనియన్‌ నేతలు, సీనియర్‌ జర్నలిస్టులు మరియు కాలనీకి చెందిన జర్నలిస్టులు హాజయ్యారు. ఈ సందర్భంగా యూనియన్‌ జిల్లా అధ్యక్షులు పయ్యావుల ప్రవీణ్‌ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమంలో యూనియన్‌ ఎప్పుడూ ముందుంటుందని, కొడిమి జర్నలిస్టుల కాలనీలో దురాక్రమణలను సమిష్టిగా ఎదుర్కోవాల్సి వుందన్నారు. కాలనీలో 198 ప్లాట్లలో ఎన్ని ప్లాట్లు ఖాళీగా వున్నాయన్న వివరాలను యూనియన్‌ పరంగా మరియు మండల రెవిన్యూ అధికారుల పరంగా సేకరించి, మిగులు ప్లాట్లను సీనియర్‌ జర్నలిస్టులకు దక్కేలా చూస్తామన్నారు. అలాగే కాలనీలో భవిష్యత్‌ అవసరాలకు వదులుకున్న ఖాళీ ప్రదేశాలను కూడా భవిష్యత్‌ అవసరాలకు ఉంచాల్సిన అవసరం వుందన్నారు. 

కఠిన చర్యలు తీసుకుంటాం ` జిల్లా ఎస్‌.పి. జగదీష్ హామి

కొడిమి జర్నలిస్టుల కాలనీలో జరుగుతున్న దురాక్రమణలు మరియు కాలనీలో తాగునీటి మోటార్లు వైర్లు కట్‌ చేయడం, పైపులు ధ్వంసం చేయడంపై  యూనియన్‌ జిల్లా అధ్యక్షులు పయ్యావుల ప్రవీణ్‌ నేతృత్వంలో జర్నలిస్టులు ఎస్‌.పి. జగదీష్‌ గారిని కలిసి వినతి పత్రాలు సమర్పించారు. కాలనీలో దురాక్రమణలు జరగకుండా చూడాలని, అలాగే కాలనీలో రాత్రి వేళలో తాగునీటి బోర్ల వైరింగ్‌ కట్‌ చేయడం, పైపులు ధ్వంసం చేస్తున్న వారిపై నిఘా వుంచి చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో కాలనీలో వుంటున్న విజయరాజ్‌ అనే వ్యక్తి ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని... రాత్రి కూడా ఇలాంటి ఘటన జరగడం వెనుక అతని ప్రమేయం ఉందా అన్న అనుమానం వ్యక్తం చేశారు.  దీనికి ఎస్‌.పి. జగదీష్ స్పందించి కొడిమి జర్నలిస్టు కాలనీలో దురాక్రమణ చేస్తున్న వారిపై,  తాగునీటి బోర్ల వైరింగ్‌ కట్‌ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు. ఈ సమావేశం మరియు జిల్లా ఎస్‌.పి.ని కలిసిన వారిలో జిల్లా అధ్యక్షులు పయ్యావుల ప్రవీణ్‌తోపాటు, యీనియన్‌ నేతలు చౌడప్ప, ప్రభాకర్‌ నాయుడు,  మార్కండేయులు, కె.పి.కుమార్‌, రామాంజనేయులు, ఎన్‌.జయరాములు, లోకరాజ్‌, పూలశెట్టి చలపతి, డేవిడ్‌, గుత్తి ఆనంద్‌, గాజుల నాగభూషణం, ప్రకాష్, సాక్షి మురళి, శ్రీనివాసులు, మల్లేష్, భూమిరెడ్డి, హోన్నూరు తోపాటు పలువురు సీనియర్‌ జర్నలిస్టులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">