వామన జయంతి ఎప్పుడు? విష్ణువు ఈ అవతారం దాల్చడానికి రీజన్ ఏమిటంటే?

Praja Tejam
0


 త్రిమూర్తులలో శ్రీ మహా విష్ణువు విశ్వాన్ని సంరక్షించే ప్రభువుగా పరిగణించబడుతున్నాడు. విశ్వాసాన్ని కాపాడడం కోసం శ్రీ మహా విష్ణువు 10 అవతారాలు ఎత్తాడు.

వాటిల్లో రామ, కృష్ణ అవతారాలు చాలా ప్రసిద్ధమైనవి. అయితే శ్రీ మహా విష్ణువుకి సంబంధించిన ఇతర అవతారాలను కూడా పూజిస్తారు. శ్రీ మహా విష్ణువు ఐదవ అవతారం వామన అవతారం. హిందూ మతంలో వామనుడిని పూజిస్తారు. అతని జన్మ దినోత్సవాన్ని వామన జయంతిగా జరుపుకుంటారు. వామనుడిని మనస్పూర్తిగా ఆరాధించి, ఉపవాసం ఆచరిస్తే భక్తులకు శుభ ఫలితం దక్కుతుంది. ఈ రోజు శ్రీ మహా విష్ణువు ఎందుకు వామన అవతారం దాల్చాల్చి వచ్చింది? వామనుడిని పూజించడానికి సరైన మార్గం ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

వామన జయంతి ఎప్పుడు జరుపుకుంటారంటే..

భాద్రపద మాసంలోని శుక్ల పక్షం ద్వాదశి రోజున వామన జయంతి జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఈ తేదీ 15 సెప్టెంబర్ 2024న వచ్చింది. ఈ రోజున ప్రజలు వామనుని పేరుతో ఉపవాసం, పూజలు చేస్తారు. ఈ ఏడాది వామన జయంతి జరుపుకునే ద్వాదశి తిథి సెప్టెంబర్ 14న రాత్రి 8:41 గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ 15, 2024 సాయంత్రం 6:12 గంటలకు ముగుస్తుంది. శ్రవణ నక్షత్రం సెప్టెంబర్ 14న రాత్రి 08:32 గంటలకు ప్రారంభమవుతుంది..ఇది 15 సెప్టెంబర్ 2024న సాయంత్రం 06:49 గంటలకు ముగుస్తుంది.

విష్ణువు వామన అవతారం ఎందుకు ఎత్తాడంటే..

విష్ణువు ఈ అవతారం దేవతలను, విశ్వాన్ని రక్షించడానికే.. అందుకే ఈ అవతారం వర్ణన జానపద కథల్లో వినిపిస్తుంది. భూమిపై రాక్షస రాజు బలి ప్రభావం పెరిగి.. దేవతలలో ఆందోళన నెలకొంది. అప్పుడు బలి గర్వాన్ని అణచడానికి, అతనికి గుణపాఠం చెప్పడానికి శ్రీ మహా విష్ణువు వామనుడిగా జన్మించాడు. అదితి, ఋషి కశ్యపుల కుమారుడిగా విష్ణువు (వామనుడు) జన్మించాడు.

పురాణ కథ ఏమిటంటే

పురాణాల ప్రకారం రాక్షస రాజు బాలి శక్తి పెరిగేకొద్దీ..అతనిలో క్రూరత్వం కూడా పెరిగింది. అప్పుడు మానవులపైనే కాదు దేవతలపై కూడా తన ప్రభావం చూపించడం మొదలు పెట్టాడు. అటువంటి పరిస్థితిలో శ్రీ మహా విష్ణువు బాల వటువు బ్రాహ్మణుడి రూపంలో బలి చక్రవర్తి దగ్గరకు వచ్చాడు. అప్పుడు ఓ యాగం జరుగుతోంది. యాగ సమయంలో దేవ గురువు శుక్రాచార్యుడు కూడా అక్కడే ఉన్నాడు. ఈ సమయంలో బ్రాహ్మణ రూపం విష్ణువు బలి చక్రవర్తి నుండి మూడడుగుల (అడుగుల) భూమిని దానంగా కోరాడు.

బలి చక్రవర్తి కేవలం 3 అడుగుల భూమే కదా.. చిన్న పిల్లవాడు ఎంత పడుతుంది అని అనుకున్నాడు. అందుకే ముందూ వెనుకా ఆలోచించకుండా వామనుడికి మూడు అడుగుల భూమిని ఇస్తానని మాట ఇచ్చాడు. బలి దానం ఇస్తానని చెబుతుంటే.. గురువు శుక్రాచార్య బలి చక్రవర్తిని అలా చేయవద్దని హెచ్చరించాడు. అయితే బలి చక్రవర్తి వామనుడి రూపాన్ని విష్ణువు అవతారంగా గుర్తించలేదు. బాలుడికి ఇచ్చేది కేవలం 3 అడుగుల భూమే కదా అని తేలికగా తీసుకున్నాడు. తన గురువు హెచ్చరికని పట్టించుకోకుండా వామనుడికి మూడు అడుగుల భూమి ఇస్తానని భరోసా ఇచ్చాడు.

వామన దేవుడు ఇంతింత వటుడింతై అన్నట్లు ఒక అడుగుతో భూమిని, మరో అడుగుతో స్వర్గాన్ని కొలిచాడు. ఇప్పుడు మూడో అడుగు ఎక్కడ అని బలి చక్రవర్తిని అడిగాడు. అప్పుడు మూడో అడుగు పెట్టడానికి ఎక్కడా స్థానం లేదు. అటువంటి పరిస్థితిలో బలి చక్రవర్తి తన తలని వామనుని ముందు ఉంచి.. వామనునుడి మూడో అడుగు తన తలపై పెట్టమని చెప్పాడు. అప్పుడు శ్రీమహావిష్ణువు తన మూడో అడుగును బలి తలపై పెట్టి.. బలిని పాతాళానికి చేరుకునేలా తొక్కేశాడు శ్రీ మహా విష్ణువు.

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">