శ్రీ విశ్వకర్మ భగవాన్ జయంతిని పురష్కరించుకుని, బి.సి. సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో స్థానిక రాణి నగర్ లోని వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఉమ్మడి అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొన్నారు. కార్యక్రమంలో మొదటగా విశ్వకర్మ భగవానుడికి ప్రత్ర్యేక పూజలు, హోమాన్ని నిర్వహించారు, అనంతరం చైర్ పర్సన్ గారు మాట్లాడుతూ ప్రతి ఏటా సెప్టెంబరు 17న విశ్వకర్మ జయంతిని నిర్వహించడం హర్షనీయమని, పంచముఖ, దశ బాహుడు, హంస వాహనుడైన విశ్వకర్మ భగవానుడు వేయి కళలకు అధినేత అని, ఈ విశ్వానికి గొప్ప ఆర్కిటెక్ అని, విశ్వబ్రాహ్మణుల ఉద్భవంతో నిత్యావసర సరుకులు మొదలు అద్బుత కట్టడాల వరకు అన్ని విశ్వబ్రాహ్మణుల ప్రతిభకు నిదర్శనం అని, ఈ కళలన్నీటికీ మూలం విశ్వకర్మ భగవానుడని, గతంలో ఈ జయంతి విశ్వబ్రాహ్మణులకు పరిమితం కాగా, ప్రస్తుతం కులమతాలకు అతీతంగా కార్మిక సోదరులందరూ కలిసి ఈ వేడుకలు నిర్వహించడం చాలా హర్షనీయమని, ఈ పర్వదినాన్ని నిజమైన కార్మిక దినోత్సవంగా అభివర్ణించడంలో అతిశయోక్తి లేదు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టరు, నగర పాలక సంస్థ డిప్యూటి మేయర్లు, బి.సి. సంక్షేమ శాఖ అధికారులు, విశ్వ బ్రాహ్మణ పెద్దలు,ఇతర పుర ప్రముఖులు మరియు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.