అధిక ఉప్పు వినియోగం ఎన్ని వ్యాధులకు వెల్‌కాం పలుకుతుందో తెలుసా?

Praja Tejam
0

 


దయం అల్పాహారం అయినా, మధ్యాహ్న భోజనం అయినా, రాత్రి భోజనం అయినా, ఏ సమయంలోనైనా.. తినే ఫుడ్ ఏదైనా అందులో ఉప్పు తక్కువగా ఉండేలా చూసుకోండి. ఉప్పు అధికంగా తినకుండా తినకూడదు.

అధిక ఉప్పు వినియోగం ప్రమాదాన్ని పెంచుతోంది. ముఖ్యంగా ఉప్పు ఎక్కువగా తింటే గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇందులో సోడియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఉప్పు ఎక్కువగా తినడం వల్ల శరీర ఆరోగ్యం చెడిపోయేందుకు పెద్దగా సమయం పట్టదు. ఆహారంలో అధిక ఉప్పు తినడం మానేస్తే ఎలాంటి లాభాలు వస్తాయో తెలుసా?

రక్తపోటు నియంత్రణ

అధిక రక్తపోటు దీర్ఘకాలిక వ్యాధి. అధిక రక్తపోటు గుండెపోటు, పక్షవాతం మొదలుకొని అనేక సమస్యలకు దారి తీస్తుంది. అయితే ఈ సమస్య నుంచి బయటపడాలంటే ముందు ఉప్పు తినే అలవాటును వదులుకోవాలి. ఉప్పులో సోడియం ఉంటుంది. ఇది శరీరంలో నీటిని నిలుపుకోవడానికి సహాయపడుతుంది. ఫలితంగా రక్తపోటు పెరుగుతుంది. ఉప్పు తక్కువగా తినడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు.

స్ట్రోక్

ఇదొక సంక్లిష్టమైన మెదడు వ్యాధి స్ట్రోక్. ఒకసారి ఈ వ్యాధి సోకితే ప్రాణానికే ముప్పు వాటిల్లుతుంది. శరీరంలో చాలా సమస్యలు వస్తాయి. ప్రాణాపాయం కూడా సంభవిస్తుంది. ఒక్కోసారి పక్షవాతం కూడా రావచ్చు. కాబట్టి ముందుగానే అధిక ఉప్పు వినియోగాన్ని తగ్గించాలి. ఒక్కసారిగా కాకుండా ప్రతిరోజూ ఉప్పు తీసుకోవడం కొద్ది కొద్దిగా తగ్గించడం ద్వారా ప్రమాదం నుంచి సులభంగా దూరంగా ఉండవచ్చు.

కిడ్నీ ఆరోగ్యం

కిడ్నీలు మన శరీరంలోని అన్ని హానికరమైన పదార్థాలను తొలగిస్తాయి. అంతేకాకుండా ఈ అవయవం వివిధ హార్మోన్ల ఉత్పత్తి, రక్తపోటు నియంత్రణతో సహా బహుళ విధులను నిర్వర్తిస్తుంది. ఆహారంలో ఉప్పు ఎక్కువగా ఉంటే కిడ్నీలు మరింత కష్టపడాల్సి వస్తుంది. దీని కారణంగా దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి సంభవించవచ్చు. కాబట్టి ఉప్పు తీసుకోవడం తగ్గించండి.

కడుపు క్యాన్సర్

ఎక్కువ ఉప్పు తినడం వల్ల కడుపు లైనింగ్ దెబ్బతింటుంది. పొట్టలో పుండ్లు ఏర్పడతాయి. రోజూ ఒక కుప్ప చొప్పున ఉప్పు తినడం వల్ల కడుపు క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయి. కాబట్టి ఉప్పు తినాలనే కోరికను అదుపులో పెట్టుకోవాలి.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">