నివాళులర్పిస్తున్న నాయకులు
ఉరవకొండ సెప్టెంబర్ 12(ప్రజాతేజం)
సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం భారత్ కమ్యూనిస్టు పార్టీ కి తీరని లోటని సిపిఎం పార్టీ ఉరవకొండ మండల కమిటీ పేర్కొన్నది ఏచూరి మృతికి గురువారం పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఏచూరి ఆశయాలను కొనసాగిస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి మధుసూదన్ నాయుడు, నాయకులు మురళి, వీరాంజనేయులు,రవికుమార్, రామాంజినప్ప తదితరులు పాల్గొన్నారు.