కృష్ణంరాజుకి బాగా నచ్చిన హీరోయిన్‌ ఎవరో తెలుసా?.. ఆమె ఒక్కరితోనే ఏకంగా 70 సినిమాలు!

Praja Tejam
0

 రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు ఎంతో మంది హీరోయిన్లతో కలిసి నటించారు. కానీ ఆయనకు నచ్చిన హీరోయిన్‌ మాత్రం ఒక్కరే అట. ఆమెతోనే ఏకంగా 70కిపైగా సినిమాలు చేయడం విశేషం.

రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు, ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. రాజుల ఫ్యామిలీ నుంచి వచ్చినా, సినిమాల్లోనూ ఓ రాజులా వెలిగాడు. అయితే నటుడిగా విలక్షణని చూపించారు. హీరోగా చేశాడు. విలన్‌గానూ చేశాడు. డిఫరెంట్‌ పాత్రల్లోనూ మెరిశారు. ముఖ్యంగా యాంగ్రి మేన్‌ పాత్రలతో, తిరుగుబాటు చేసే పాత్రలతో మెప్పించి రెబల్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.

కృష్ణంరాజు ఐదు దశాబ్దాల కెరీర్‌లో సుమారు రెండు వందల సినిమాల్లో నటించారు కృష్ణంరాజు. యాక్షన్‌ సినిమాలతోపాటు ఫ్యామిలీ చిత్రాల్లోనూ మెప్పించారు. అదే సమయంలో చాలా మంది హీరోయిన్లతోనూ కలిసి నటించాడు. హీరోయిన్లతో అదిరిపోయే కెమిస్ట్రీని పండించి మెప్పించారు.

వెండితెరపై కృష్ణంరాజుతో జోడీ అంటే ఇద్దరు ముగ్గురు హీరోయిన్ల పేర్లే ఎక్కువగా వినిపిస్తుంటాయి. వారిలో మొదటి పేరు జయసుధకే దక్కుతుంది. మరి రెబల్‌ స్టార్‌ మెచ్చిన, ఆయనకు బాగా నచ్చిన హీరోవరనేది చూస్తే. ఆమె జయసుధనే.

జయసుధ అంటే కృష్ణంరాజు అంటే చాలా ఇష్టం. ఫేవరేట్‌ హీరోయిన్‌. అటు నటిగా, మరోవైపు తనతో జోడీ కట్టే విషయంలోనూ ఆయనకు జయసుధ అంటే బాగా నచ్చుతుందట. అయితే ఆమె అంతగా నచ్చడానికి కారణం చెప్పారు కృష్ణంరాజు.

ఇతర హీరోయిన్లు అయితే తనతో నటించే విషయంలో బ్యాలెన్స్ తప్పుతుందని, సీన్లని పెంచేందుకు తామిద్దరం సహకరించుకుని నటిస్తామని, ఆ కెమిస్ట్రీ బాగా పండుతుందని చెప్పారు. ఇంటిమేట్‌ సీన్లు గానీ, భార్యాభర్తల పాత్రలు గానీ, డ్యూయెట్స్ గానీ బాగా సెట్‌ అవుతాయని చెప్పారు.

తమ ఇద్దరి మధ్య ఒక అండర్‌ స్టాండింగ్‌ ఉంటుందన్నారు కృష్ణంరాజు. అందుకే ఆమెతోనే ఏకంగా 70కిపైగా సినిమాలు చేసినట్టు తెలిపారు. తాను నటించిన సుమారు 200 సినిమాల్లో 70-80 జయసుధతోనే కావడం విశేషం. ఇన్ని సినిమాలు ఈ ఇద్దరు కలిసి చేశారంటే ఏ రేంజ్‌లో అండర్‌ స్టాండింగ్‌ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

ఇక తనకు గ్లామర్‌ పరంగా నచ్చిన హీరోయిన్‌ ఎవరంటే శ్రీదేవి పేరు చెప్పాడు రెబల్‌ స్టార్‌. అందం విషయంలో శ్రీదేవిదే పై చేయి అని, ఆమె అందం తనకు నచ్చుతుందని, తామిద్దరం కలిసి ఏడెనిమిది సినిమాలు చేశామని తెలిపారు. కేవలం డాన్సులు, కమర్షియల్‌ హీరోయిన్‌ అనే యాంగిల్‌లోనే ఆమెతో సినిమాలు చేసినట్టు తెలిపారు.

ఇలాంటి ఇంటిమేట్‌ సీన్లు ఆమెతో లేవని తెలిపారు. రెబల్‌ స్టార్‌ వర్థంతి నేడు. రెండేళ్ల క్రితం ఆయన అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. రెబల్ స్టార్ వారసత్వాన్ని ప్రభాస్‌ కొనసాగిస్తున్నారు. తండ్రిని మించిన తనయుడిగా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆయన గ్లోబల్‌ స్టార్‌గా రాణిస్తున్న విషయం తెలిసిందే.

ఇక కృష్ణంరాజు, జయసుధ కలిసి నటించిన చిత్రాల్లో భరతంలో శంఖారావం, కళ్యాణ చక్రవర్తి, జగ్గు, నేటి యుగధర్మం, కోటి కొక్కడు, అగ్గిరాజు, పృథ్వీరాజ్‌, శివమెత్తిన సత్యం, మరణ శాసనం, ఆడావాళ్లు మీకు జోహార్లు, మా ఇంటి మహారాజు, నిప్పుతో చెలగాటం, రామలక్ష్మణులు, గువ్వల జంట, సర్దార్‌ ధర్మన్న, అల్లుడు పట్టిన భరతం, యుద్ధం, తిరుగుబాటు, ధర్మాత్ముడు, మధుర స్వప్నం, అగ్నిపూలు, జైలర్‌గారి అబ్బాయి, ప్రేమ తరంగాలు, జీవన తీరాలు, కటకటాల రుద్రయ్య, సింహ స్వప్నం, బొబ్బిలి బ్రహ్మన్న, కిరాయి దాదా, తాండ్ర పాపారాయుడు, త్రిశూలం, బావబావమరిది వంటి చిత్రాల్లో కలిసి నటించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">