సూపర్ స్పెషాల్టీ వైద్యశాలకు కియా రూ.5 కోట్ల వైద్య సామగ్రి వితరణ

Praja Tejam
0



*కియా తరహాలో మరికొన్ని కంపెనీలు  ముందుకు రావాలి *

ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం

*రాష్ట్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం & వైద్య విద్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్

*కియా కంపెనీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే దగ్గుపాటిప్రసాద్ *

అనంతపురం, సెప్టెంబర్ 19: అనంతపురం  నగరంలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నందు KIA INDIA Pvt. Limited వారు అనంతపురము గవర్నమెంట్ సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ కి హెచ్ డి ఐవస్, రోటా ప్రొ, ఎఫ్ఎస్ఆర్ అను పరికరములను కార్డియాలజీ విభాగానికి విరాళంగా ఇచ్చిన పరికరాలను  మరియు అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్    మరియు    కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ కబ్ డాంగ్ లీ, CAO లతో కలిసి రాష్ట్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం & వైద్య విద్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ ప్రారంభోత్సవం చేశారు.

గురువారం అనంతపురం నగరంలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి లో  రాష్ట్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం & వైద్య విద్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ..కియా తరహాలో మరికొన్ని కంపెనీలు ఇలాంటి వాటికి ముందుకు రావాలని తెలిపారు.ఇప్పుడు వైద్యానికి కేంద్ర, రాష్ట్ర ఎన్డీఏ కూటమి కూటమి ప్రభుత్వం వైద్యానికి పెద్ద పీట వేస్తోందన్నారు.గత ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేసి ఉంటే  ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి, ప్రజలందరూ ఆరోగ్యంతో వర్ధిల్లాలని అని భావంతో పనిచేసే మన ముఖ్యమంత్రి గారు ఉన్నారని తెలిపారు. ప్రత్యేక నిధుల కోసం ఇంటర్నేషనల్ ఏజెన్సీ వారి ద్వారా నిధుల కోసం కృషి చేస్తామన్నారు. అనేకమంది దాతలు విద్యా, వైద్యం గురించి గతంలో దానం చేసేవారని, ఇటీవల పరిస్థితుల్లో మార్పులు వచ్చాయని, సహాయం చేయడానికి కూడా చాలామంది ముందున్నారని, ఎన్డీఏ ప్రభుత్వం తరపున వారందరికీ ఆహ్వానిస్తున్నాం, ప్రభుత్వం తరఫున వారికి అందించాల్సిన సహాయ, సహకారాలు అందిస్తామని తెలిపారు.గత ప్రభుత్వం తమపై ఈ భారాన్ని మోపిందని తెలిపారు. ఇది కాకుండా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మౌలిక వసతులకు సంబంధించిన  కేటాయించిన నిధులను గత ప్రభుత్వం పక్కదారి మల్లించాయని తెలిపారు. ఈ ప్రభుత్వం పై ఆర్థిక భారం ఆర్థిక వనరుల కొరత ఉన్నందున పరిమితులను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం నుండి సహకారం కోరుతున్నామన్నారు. వీటిని అన్నిటిని అధిగమించి నాణ్యమైన సేవలందించి  ఆరోగ్యానికి ఆంధ్రప్రదేశ్ చిరునామా కావాలని ఈ  ఐదు సంవత్సరాలలో తీర్చిదిద్దుతామన్నారు. డాక్టర్ల కొరత, సిబ్బంది కొరత, మౌలిక వసతులు, ఆర్థిక భారము, ఆర్థిక వనరులు ఇలా అనేక రకాల  సమస్యలు ఎక్కువగా ఉన్నందున దీనిని ఎలా అధిగమించాలని విషయంపై చర్చించి సరిదిద్దటానికి ఆ దిశగా  ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి గారు సమీక్ష కూడా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఇటీవల గుండె సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని ఇందుకోసం ప్రతి సీహెచ్సీలో 45వేల రూపాయల విలువచేసే  గుండె సంబంధిత మందులను (ఇంజక్షన్స్) అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు చెప్పారు. క్యాన్సర్ నివారణ, చికిత్సల కోసం ప్రత్యేత చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అలాగే 6నెలల నుంచి 18ఏళ్ల పిల్లలకు 44రకాల వైద్య పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయించిందన్నారు. అక్టోబర్ నెలలో వీటిని ప్రారంభిస్తున్నామన్నారు.

ఈ సందర్భంగా అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ.. కియా మోటార్స్ ఇండియా చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. అనంతపురం సూపర్ స్పెషాల్టీ వైద్యశాలకు పెనుకొండ వద్ద ఉన్న కియా సంస్థ సీఎస్ఆర్ ఫండ్స్ కింద రూ.5 కోట్లు విలువైన వైద్య సామగ్రిని వితరణగా చేసిందని  ఈ పరికరాల వలన ఎంతో మంది రోగులకు చికిత్సలు అందుతాయన్నారు. సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రిలో ఇక నుంచి మెరుగైన వైద్య సేవలందించాలని వైద్యులకు సూచించారు. కార్పొరేట్ రెస్పాన్సిబులిటీ కింద మరికొన్ని కంపెనీలు ఇలా వైద్య రంగానికి సాయం అందించాలన్నారు. ఉమ్మడి జిల్లాకు ప్రధాన ఆధారంగా ఉన్న సర్వజనాసుపత్రిలో 1200పడకలకు పెంచుతున్నట్టు చెప్పారు. మంత్రి గారు కూడా దీనిపై హామీ ఇచ్చినట్టు తెలిపారు.


అనంతరం KIA INDIA Pvt. Limited వారు అనంతపురము గవర్నమెంట్ సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ కి హెచ్ డి ఐవస్, రోటా ప్రొ, ఎఫ్ఎస్ఆర్ అను పరికరములను కార్డియాలజీ విభాగానికి విరాళంగా ఇచ్చినందుకు గాను శ్రీ  కబ్ డాంగ్ లీ, CAO గారిని  సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డా.వెంకటేశ్వరరావు, సూపర్ స్పెషాలిటీ సూపరింటెండెంట్ డా.సుబ్రహ్మణ్యం, అనస్థీషియా హెచ్ఓడి నవీన్, కార్డియాలజీ ఆర్ఎంవో సుభాష్ చంద్రబోస్, ఎమ్మెస్ఐడిసి ఈఈ చంద్రశేఖర్ రెడ్డి, డి ఎం హెచ్ ఓ  ఈ బి దేవి,డాక్టర్లు,నర్సులు, తదితరులు పాల్గొన్నారు.


Tags

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">