* ఒకరికి జీవితఖైదు... ఏడుగురికి చెరో 7 సంవత్సరాల జైలు శిక్ష
* ఈ 8 మంది నిందితులకు చెరో రూ. 5 వేలు జరిమానా
* అప్పటి దర్యాప్తు అధికారి, పి.పి మరియు సకాలంలో నిందితులను హాజరు పరిచి శిక్షలు పడేందుకు కృషి చేసిన పోలీసు సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS
** జీవిత ఖైదు & 7 సంవత్సరాల జైలు శిక్షలు పడిన నిందితులు వీరే...
* బసిరెడ్డి రమేష్ రెడ్డి ... ఇతనికి జీవిత ఖైదు
* K. సూర్యనారాయణ రెడ్డి ... ఇతనికి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష & రూ 5 వేలు జరిమానా
* L. సుదర్శన్ రెడ్డి... ఇతనికి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష & రూ 5 వేలు జరిమానా
* R. లక్ష్మి ...ఈమెకి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష & రూ 5 వేలు జరిమానా
* M. నాగరాజు ....ఇతనికి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష & రూ 5 వేలు జరిమానా
* M. చంద్రాయుడు... ఇతనికి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష & రూ 5 వేలు జరిమానా
* C. హరినాథరెడ్డి...ఇతనికి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష & రూ 5 వేలు జరిమానా
* ప్యాపిలి మురళి... ఇతనికి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష & రూ 5 వేలు జరిమానా
వీరందరిదీ తెలికి, మామిళ్ళవారి పల్లి, తుట్రపల్లి, అనంతపురం టౌన్, రామాపురం, నాగలూరు, మామిళ్ళపల్లి, సూర్యదేవర నగర్ ప్రాంతాలు/ గ్రామాలకు చెందిన వారు
** కేసు వివరాలు :
అనంతపురం నగరం నీరుగంటి వీధికి చెందిన ఫిర్యాది భాగ్యలక్ష్మి తమ్ముడైన విజయ్ మోహన్ లు సొంత పనిమీద 12.09.2015 వ తేదీన పామిడి పట్టణానికి వెళ్లారు. ఈ 8 మంది నిందితులు మూకుమ్మడిగా అక్క, తమ్ముడులను కిడ్నాప్ చేసి బెదిరించి వారి వారి బ్యాంకు అకౌంట్లో ఉన్న రూ. 47 లక్షల రూపాయలు బ్యాంకు నుండి విత్ డ్రా చేయించారు. ఈ విషయం ఎక్కడ బయట పడుతుందనే ఉద్దేశంతో ఫిర్యాదు తమ్ముడు విజయ్ మోహన్ ను 25.12.2015 వ తేదీన గొంతు నులిమి చంపి,నీటి కాలువలో పడసినట్లు భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు 31.12.2015 వ తేదీన అప్పటి
పామిడి UPS సి.ఐ ఆర్ రవి శంకర్ రెడ్డి కేసు Cr. no.196/2015 u/s. 346 365,384,302,201 r/w 34 IPC నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం... 4 th sessions judge for mahila trail cases court అనంతపురం నందు charge sheet దాఖలు చేశారు. ఈ కేసు లో గౌరవ జడ్జి శ్రీమతి శోభారాణి గారు13 మంది సాక్షులను విచారించి నేరం రుజువు అయినందున ఈ రోజు నిందితులకు పైవిధంగా శిక్షలు వేస్తూ తీర్పు వెలువరించారు. ఈ కేసు ను PP శ్రీమతి సృజన ప్రాసిక్యూషన్ తరపున వాదించారు. అనంతపురం జిల్లా ఎస్పీ సార్ గారి ఆదేశాల మేరకు పామిడి UPS సి.ఐ, కోర్టు మానిటరింగ్ సిస్టం సి.ఐ ఆర్ ప్రతాప్ రెడ్డి పర్యవేక్షణలో కోర్టు లైజన్ ఆఫీసర్ ఏఎస్సై S.శ్రీనివాసులు, హెడ్ కానిస్టేబుళ్లు సౌ రెడ్డి, లక్ష్మీనారాయణలు సాక్షులను సకాలంలో కోర్టులో హాజరుపరచి, నిందితులకు శిక్ష పడేందుకు తమ వంతుకృషి చేశారు. అప్పటి దర్యాప్తు అధికారి ఆర్ రవిశంకర్ రెడ్డి సహా పి.పి మరియు పోలీసు అధికారులు, కోర్టు పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారు అభినందించారు.