- : ఓబిసి కమిటీ సభ్యులు మరియు అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ
అనంతపురం, సెప్టెంబర్ 19 :
- ఓబిసిలకు ఆర్థికంగా, విద్యా, సామాజికంగా, అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడ్పాటు అందించాలని ఓబిసి కమిటీ సభ్యులు మరియు అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కోరారు. న్యూఢిల్లీ పార్లమెంట్ అన్నెక్స్ బిల్డింగ్ లో గురువారం జరిగిన ఓబిసి కమిటీ సమావేశంలో ఓబిసి కమిటీ సభ్యులు మరియు అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఓబిసిలకు ఆర్థికంగా, విద్యా, సామాజికంగా, అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తోడ్పాటు అందించాలన్నారు. ముఖ్యంగా యువతకు ఉద్యోగ, విద్యా రంగాలలో పూర్తి స్థాయిలో రిజర్వేషన్ అమలు పరచాలని, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని, సోషల్ జస్టీస్ మరియు డిఫెన్స్ అధికారులను ఎంపీ కోరారు.