అంగట్లో ఆడ శిశువు.. రూ.1.90 లక్షలకు విక్రయించిన తండ్రి! పోలీసుల ఎంట్రీతో గుట్టు రట్టు

Praja Tejam
0


 గుంటూరు, సెప్టెంబర్‌ 12: ఆడశిశువును కన్న తల్లిదండ్రులే అంగట్లో పశువుల మాదిరి అమ్మేశారు. బరువనుకున్నారో.. ఇంటికి పట్టిన శని అనుకున్నారో.. తెలియదు గానీ పేగు పాశాన్ని తెంపుకుని వేరొకరికి విక్రయించి చేతులు దులుపుకున్నారు.

ఈ సంఘటన గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్లితే.. గుంటూరులోని జీజీహెచ్‌లో భట్టిప్రోలుకు చెందిన మీరాబి అనే మహిళ కొద్ది రోజుల క్రితం శిశువుకు జన్మనిచ్చింది. అయితే ఆ పసికందు పురిట్లోనే మృతి చెందింది. బిడ్డ చనిపోయినప్పటికీ తల్లి మీరాబి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతోంది. అయితే సోమవారం మీరాబి వద్ద మరో ఆడ శిశువు ఉండటాన్ని ఆస్పత్రి సిబ్బంది గమనించారు. ఎక్కడైనా శిశువును దొంగిలించారా? లేదంటే ఎవరివద్దైనా కొనుగోలు చేశారా అనే అనుమానం వీరిలో తలెత్తింది. దీంతో అప్రమత్తమైన జీజీహెచ్ గైనకాలజిస్ట్ ప్రొఫెసర్ జయంతి ఉన్నతాధికారుల ద్వారా ఐసీడీఎస్‌ అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న ఐసీడీఎస్‌ అధికారులు కొత్తపేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి. పోలీసులు విచారణ చేపట్టగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

నిజానికి, బాపట్ల జిల్లా చినగంజాంకు చెందిన లక్ష్మీ అనే మహిళ చీరాలలో ఆడశిశువుకు జన్మనిచ్చింది. రెండు వారాల క్రితం ఆమె వైద్యం నిమిత్తం మీరాబి పురుడు పోసుకున్న అదే గుంటూరు ప్రభుత్వా ఆసుపత్రికి వచ్చింది. అయితే అక్కడ చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించి మృతి చెందింది. దీంతో తల్లిలేకపోవడంతో పసికందు పాలకోసం అల్లాడిపోసాగింది. ఈ విషయం తెలుసుకున్న మీరాబి స్నేహితురాలు ప్రభావతి మెదడులో మెరుపలాంటి ఆలోచన వచ్చింది. వెంటనే దాన్ని అమలు చేసింది. చిన్నగంజాంకు వెళ్లి లక్ష్మి భర్త సుబ్రమణ్యంను కలిసింది. అప్పుడే తెలిసింది.. అప్పటికే లక్ష్మికి ఎనిమిది మంది సంతానం ఉన్నట్లు.

తన స్నేహితురాలి పరిస్థితి గురించి లక్ష్మి భర్త సుభ్రమణ్యంకు చెప్పి.. ఆడ శిశువును విక్రయించేందుకు అతన్ని ఒప్పించింది. అనంతరం అతనికి రూ.1.90 లక్షలు చెల్లించి అతని వద్ద ఉన్న ఆడ శిశువును కొనుగోలు చేసింది. ఆమె శిశువును తీసుకుని ఆస్పత్రికి వచ్చి మీరాబికి అప్పగించినట్లు పోలీసుల విచారణలో తేలింది. అనధికారికంగా బిడ్డను కొనుగోలు చేయడం నేరంగా పరిగణించిన పోలీసులు మీరాబి నుంచి శిశువును స్వాధీనం చేసుకుని ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలోని శిశు సంక్షేమ వసతి గృహ కేంద్రానికి తరలించారు.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">