తిరువనంతపురంలో జరుగుతున్న కేరళ క్రికెట్ లీగ్ టీ20 టోర్నీలో విష్ణు వినోద్ రికార్డు సెంచరీ సాధించాడు. కేవలం 32 బంతుల్లోనే సెంచరీ బాదేసి.. రోహిత్ శర్మ రికార్డును బద్దలుకొట్టాడు.
ఇక 182 పరుగుల లక్ష్యచేధనలో భాగంగా బరిలోకి దిగిన త్రిసూర్ టైటాన్స్‌కు ఓపెనర్ విష్ణు వినోద్ శుభారంభం అందించాడు. తొలి ఓవర్ నుంచే దూకుడైన ఆటతీరుతో.. అలెప్పీ బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఫలితంగా విష్ణు వినోద్ బ్యాట్‌తో కేవలం 32 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. మొత్తంగా విష్ణు వినోద్ 45 బంతుల్లో 17 సిక్సర్లు, 5 ఫోర్లతో 139 పరుగులు చేశాడు. తన పేలుడు సెంచరీతో త్రిసూర్ టైటాన్స్.. 44 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో లక్ష్యాన్ని చేధించింది.
ఇక్కడొక ఆసక్తికర విషయమేంటంటే.. 32 బంతుల్లోనే సెంచరీ కొట్టి.. టీ20 క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన భారత బ్యాట్స్‌మెన్‌గా విష్ణు వినోద్ రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు రిషబ్ పంత్ పేరిట ఉండేది. 2018 సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పంత్ 32 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఇప్పుడు ఈ రికార్డును విష్ణు వినోద్ సమం చేశాడు. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉంది. 2017లో శ్రీలంకపై హిట్‌మ్యాన్ 35 బంతుల్లో సెంచరీ కొట్టాడు.