వన్డే ప్రపంచకప్‌.. దేశానికి 11,637 కోట్ల ఆదాయం

Praja Tejam
0


 తేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యమిచ్చిన విషయం తెలిసిందే. సొంతగడ్డపై టైటిల్ చేజిక్కించుకునే అవకాశాన్ని తృటిలో చేజార్చుకుంది టీమిండియా.

ఓటమన్నదే లేకుండా వరుస విజయాలతో ఫైనల్‌కు చేరిన రోహిత్ సేన.. ఆఖరి మెట్టుపై బోల్తాపడింది. ఆస్ట్రేలియా చేతిలో ప్రభావాన్ని ఎదుర్కొని రన్నరప్‌తో సరిపెట్టుకుంది. తాజాగా, ఈ టోర్నీ వల్ల దేశానికి వచ్చిన ఆర్థిక లాభాలను వివరిస్తూ ఐసీసీ బుధవారం(సెప్టెంబర్ 11) ఒక సమగ్ర ఆర్థిక నివేదికను విడుదల చేసింది.

10 నగరాలు..

వన్డే ప్రపంచకప్‌ను దేశంలోని 10 నగరాల్లో నిర్వహించారు. ఆ పది నగరాలు.. అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ధర్మశాల, హైదరాబాద్, కోల్‌కతా, లక్నో, ముంబై మరియు పూణే. ఇన్ని నగరాలు ఆతిథ్యమివ్వడం ద్వారా విదేశీ పర్యాటకులు వసతి, ప్రయాణం, రవాణా, ఆహారం, పానీయాల అమ్మకాల ద్వారా రూ. 7,211.59 కోట్ల (USD 861.4m) ఆదాయం వచ్చినట్లు ఐసీసీ తెలిపింది.1.25 మిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రేక్షకులు మ్యాచ్‌లకు హాజరైనట్లు ఐసీసీ నివేదిక బయటపెట్టింది. మొత్తం ప్రేక్షకులలో 75 శాతం మంది మొదటిసారి వన్డే ప్రపంచ కప్‌కు హాజరయ్యారు. అంతేకాదు, ఈ మ్యాచ్ ల వల్ల ఆతిథ్య రంగంలో ప్రత్యక్షంగా సుమారు 48,000 కంటే ఎక్కువమంది పార్ట్ టైమ్, ఫుల్ టైమ్‌ ఉద్యోగావకాశాలు పొందారని ఐసీసీ పేర్కొంది. తద్వారా హాస్పిటాలిటీ రంగంలో ఆర్థిక వ్యవస్థకు USD18 మిలియన్ల ఆదాయం చేకూరినట్లు వివరించింది.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">