అనంతపురం: సింధు నాగరికత నుంచి సనాతన సంస్కృతి సాంప్రదాయాలను.. సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు బంజారాలు. తెలంగాణలో బతుకమ్మ పండుగ తరహాలో గిరిజన తండాలో పల్లెదనం ఉట్టిపడేలా పూర్వీకుల నుంచి వస్తున్న తమ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు.
ఈ పండుగ తలపెట్టే బంజారా యువతులు (పెళ్లి కాని యువతులు ) 11 రోజులపాటు వ్రతము అనుసరిస్తూ ఆహార నియమాలను పాటించి భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. భవిష్యత్తులో ప్రతి ఒక్కరి కుటుంబాలు బాగుండాలని నవతరానికి బీజం లాంటిది తీజ్ పండుగని బంజారా నేతలు పేర్కొన్నారు. గంపలలో మొలకెత్తిన గోధుమ మొక్కలను తుల్జా భవాని సామా సంగ్ మహారాజ్ లను పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించి గంపలో పెరిగిన తీజ్ మొక్కలను బంజారా నేతలకు తమ తలపాగలు ఉంచుతారు. ఈ మొక్కలను బంజారా లు భక్తిశ్రద్ధలతో తమ ఇండ్లలో భద్రపరచుకుంటారు. ఆ మొక్కలు ఎవరింట్లో అయితే ఉంటదో వారింట్లో సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలు వర్ధిల్లుతాయని బంజారాల విశ్వాసం. ఉత్సవాల ఆఖరి రోజు గోధుమ మొక్కలు ఉన్న గంపలను శోభాయాత్రగా ప్రదర్శన నిర్వహించి గ్రామ నాయక్ బావిలో నిమజ్జనం చేస్తారు. అనంతరం బంజారా కన్యల సోదరులు తెచ్చిన తిను బండారాలు గుగ్గులను ఒకచోట చేరి ఆరగిస్తారు. ఇంతటితో ఈ పండుగ ముగిస్తుంది.
బంజారాలకు అతిపెద్ద పండుగ :
తీజ్ పండుగ తిలకించడానికి రూపా నాయక్ తండాకు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి బంజారాలు వచ్చి పండుగలు పాల్గొంటారు. రూపా నాయక్ తండాలోని నాయక్ డావో కార్ భారీ చౌహాన్ రాథోడ్ పమార్ జాదవ్ గోత్రాల వారు సమిష్టిగా పాల్గొని పండుగను జరుపుతారు. రూపా నాయక్ తండాకు అనుబంధంగా ఉన్న కలగల తండా, జేరుట్ల రాంపురం తండా, వెంకటం పల్లి చిన్న తండా, పందికుంట తండా బంజారా లు అధికంగా పాల్గొంటున్నారు.
బంజారాల ఐక్యతకు నిదర్శనం తీజ్ పండుగ
ఐక్యత, ఆదర్శానికీ, సంస్కృతికి నిదర్శనం బంజారాల తీజ్ ఉత్సవాలు. సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ సంస్కృతి సాంప్రదాయాలతో బంజారాల తీజ్ ఉత్సవాలని నిర్వహిస్తారు. 11 రోజులపాటు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించబడే తీజ్ ఉత్సవాలు ప్రారంభోత్సవం అయింది. ఈ సందర్భంగా రూపా నాయక్ తండా తో పాటు జెరుట్ల రాంపురం, వెంకటం పల్లి చిన్న తండా, పందికుంట తండా, కలగళ్ల తండా వాసులు పాల్గొంటూ ఆ వివాహిత బంజారా కన్యలు తమ వేషాధారణ ధరించి సాంప్రదాయ పద్ధతిలో సాయంత్రం గోధుమలు తీసుకువచ్చేందుకు బయలుదేరుతారు. అనంతరం వెదురు బుట్టలు, ఎర్రటి పుట్టమన్ను, ఇసుకను గంపలలో గోధుమ మొక్కలను పెంచి వాటి చుట్టూ వివిధ పుష్పాలతో బతుకమ్మ తరహాలో అలంకరించి దేవుడి వద్దకు తీసుకువస్తారు.
పెళ్లి కాని బంజారా యువతులు నియమ నిష్టలతో అత్యంత భక్తి ప్రపత్తులతో అనుసరించాల్సిన నియమాలను తెలియజేస్తారు. బంజారా సాంప్రదాయ రీతిలో తీజ్ ఉత్సవాల పాటలను పాడుతూ నృత్యాలను చేస్తూ రాత్రంతా వివిధ విన్యాసాలతో తండాలో సందడి నెలకొంటుంది. ఈ ఉత్సవాలలో ఉన్నత చదువులు చదువుకున్న బాలికలు సైతం తమ సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఇతర ప్రాంతాల్లో ఉన్నవాళ్లు సైతం తమ తమ తండాలకు కుటుంబ సమేతంగా చేరుకుంటారు.